విశాఖ స్టీల్‌ ప్లాంట్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం

-

విశాఖ స్టీల్‌ ప్లాంట్ పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. వైజాగ్‌ స్టీల్ ప్లాంట్‌ పరిరక్షణ కోసం జనసేన డిజిటల్‌ క్యాంపెయిన్ నిర్వ‌హించాల‌ని పవన్‌ కళ్యాణ్ నిర్ణ‌యం తీసుకున్నారు. రేపట్నుంచి మూడు రోజుల పాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం డిజిటల్‌ క్యాంపెయిన్‌ మొదలు పెడుతున్నామ‌ని.. 151 మంది ఎమ్మెల్యేలు.. 22 మంది ఎంపీలు ఉన్న వైసీపీ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గళం విప్పడం లేదని ఫైర్ అయ్యారు.

ప్రైవేటీకరణ విషయంలో కేంద్రానిదే బాధ్యత.. మనమేం చేయనక్కర్లేదనే ధోరణితో వైసీపీ ఉందని.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీకి తన బాధ్యతను గుర్తు చేసేలా డిజిటల్ క్యాంపెయిన్ ఉంటుంద‌న్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలు విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్లకార్డులు ప్రదర్శించాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కలిసిన రావాల్సిన సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీలు విబేధాలు పక్కన పెట్టి ముందుకు రావాలని కోరారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ విషయంలో వైసీపీ అఖిలపక్షం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news