చంద్రబాబు కుట్రకు జ్ఞానేశ్వర్ బలి అంటూ YCP సెటైర్లు పేల్చింది. తెలంగాణ టిడిపికి కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేయడంపై వైసీపీ స్పందించింది. ‘చంద్రబాబు కుట్రకు కాసాని బలయ్యారు. ఒకరితో పెళ్లి, ఇంకొకరితో ప్రేమ అనే రాజకీయాలను నేర్పే చంద్రబాబు తెలంగాణలో కాంగ్రెస్ కు మేలు చేసేందుకు ఎన్నికల్లో పోటీకి దూరమయ్యారు.
బిజెపి, కేసిఆర్ పై ద్వేషంతో కాంగ్రెస్ కు రహస్యంగా లబ్ధి చేకూర్చేలా ఎత్తులు వేశాడు. ఈ లాలూచీ రాజకీయాలు భరించలేక జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు’ అని విమర్శించింది. ఇది ఇలా ఉండగా, తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవికి ఆ కాసాని జ్ఞానేశ్వర్ రాజీనామా చేశారు. పార్టీకి, అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దని అధిష్టానం నిర్ణయించినందు వల్లే రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలో ఆయన తన భవిష్యత్తుపై ప్రకటన చేయనున్నారు. అంతేకాకుండా.. చంద్రబాబు నాయుడిని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిసి వచ్చాను అని కాసాని జ్ఞానేశ్వర్ తెలిపారు. నేను ఫోన్ చేస్తే.. నారా లోకేష్ లిఫ్ట్ చేయలేదన్నారు.