YCP vs Janasena : విజయవాడలో ప్లెక్సీల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ సిద్ధం అనే ప్లెక్సీకు ధీటుగా మేము సిద్ధం అంటూ విజయవాడలో జనసేన ప్లెక్సీలు వెలిశాయి.
కృష్ణలంక జాతీయ రహదారిపై వైసిపి సిద్దం…జనసేన మేము సిద్ధం బ్యానర్లు కలకలం రేపుతున్నాయి. అయితే.. వైసీపీ ఫ్లెక్సీ పక్కనే జనసేన మేము సిద్ధం ప్లెక్సీ ఉండటం చర్చనీయాంశంగా మారింది.
అయితే.. జనసేన మేము సిద్ధం ప్లెక్సీపై వైసీపీ ఎంపీ భరత్ కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ కు పోటీగా పవన్ కళ్యాణ్ సిద్ధం అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని భరత్ హేళన చేశారు. పవన్ కళ్యాణ్ సిద్ధమవుతుంది నాలుగో పెళ్లికా అంటూ కౌంటర్ ఇచ్చారు.
విభజించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబు అని.. ప్రత్యేక హోదా కోసం పోరాడిన వారిపై కేసులు పెట్టింది చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. పోలవరం ప్రాజెక్టు ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహించారు. సెంట్రల్ జైల్లో ఉండగా చంద్రబాబు కిటికీలో నుంచి రాజమండ్రి అభివృద్ధిని చూసి ఉంటారని ఎద్దేవా చేశారు.