ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురిసిన విషయం విధితమే. ఈ వరదలకు తోడు బుడమేరుకు గండ్లు పడటంతో స్థానికులు తీవ్ర అవస్థలు పడ్డారు. సీఎం చంద్రబాబు దాదాపు 10 రోజుల పాటు నిర్విరామంగా పర్యటించి వరద బాధితులకు ధైర్యం చెప్పారు. తాజాగా ఇవాళ విజయవాడ వరద బాధితులకు పరిహారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. వైసీపీ కుట్ర వల్లనే బోట్లతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించారు.
బోట్ల వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందన్నారు. కనీస బాధ్యత లేకుండా ఆంబోతుల మాదిరి వ్యవహరించారు. అనంతపురంలో రథం కాల్చేసారు. బోట్ల విషయంలో కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేస్తామన్నారు. నేను అసమర్థుణ్ని కాను.. ఎవరు ఏం తప్పు చేసినా తెలిసేలా వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. ఎవరైనా కుట్రలు పన్నితే ఖబ్డదార్ అని హెచ్చరించారు. గత ప్రభుత్వం గండ్లు పూడ్చకపోవడం వల్లనే బుడమేరుకు వరద ప్రవాహం వచ్చిందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.