రాష్ట్రంలోని మైనింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు యూఎస్ సహా ఇతర దేశాల కంపెనీలు ఆసక్తి కనబరిచాయని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.అమెరికాలోని లాస్‌వేగాస్ నిర్వహిస్తున్న ప్రపంచ అతిపెద్ద మైనింగ్ ఎక్స్ పో -2024ను భట్టి విక్రమార్క తన బృందంతో కలిసి సందర్శించారు. మైనింగ్ పరికరాల తయారీదారులతో పాటు యూఎస్ గవర్నమెంట్‌లోని వివిధ అత్యున్నత స్థాయి అధికారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
అనంతరం మైనింగ్ ఎక్స్ పో విశేషాలను ‘ఎక్స్’ వేదికగా పోస్టు చేశారు.ప్రపంచంలోనే అతిపెద్ద సమావేశమైన లాస్ వెగాస్‌లోని మైనింగ్ ఎక్స్ పోలో తెలంగాణ ప్రభుత్వం తరుపున భాగస్వామ్యమవ్వడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో తాజా మైనింగ్ ఆవిష్కరణలు, సాంకేతికతలు, యంత్రాల ప్రదర్శన, పరిశ్రమ నిపుణులతో నెట్‌వర్క్‌కు అవకాశాలపై అవగాహనకు సంబంధించిన వేదిక దొరికిందన్నారు. 125 కంటే ఎక్కువ దేశాల నుంచి 44,000 మంది నిపుణులు ఈ ఈవెంట్‌కు హాజరైనట్లు పేర్కొన్నారు. మైనింగ్ రంగం అభివృద్ధిని ప్రోత్సహించే దిశగా ఆమెరికా, భారత్ భాగస్వామ్యం భవిష్యత్‌ను మరింత ఆశాజనకం చేస్తుందని వివరించారు.