ఇప్పుడు ఏపీని పాలిస్తున్న వ్యక్తి.. ఎవ్వరూ ఊహించని స్థాయిలో అధికారాన్ని కైవసం చేసుకున్న శక్తి.. “నేను విన్నాను – నేను ఉన్నాను” అంటూ దూసుకుపోతున్న బాణం జగన్. రాష్ట్రం మాత్రమే కాదు.. దేశం మొత్తం ఈ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుకుంటున్నారు, ఈయన పనితనంపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు అంటే అది అతిశయోక్తి కాదేమో! నేడు అలా ప్రత్యర్ధులను పులిలా గర్జించి, తొక్కేసిన వ్యక్తి.. బుడ్డోడుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నారో చూశారా!
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మాత్రమే ఆయనను గుర్తుచేసుకునే పరిస్థితి ఆయన కుమారుడు తీసుకురాలేదు! నిత్యం వైఎస్సార్ నామస్మరణ రాష్ట్రంలో జరుగుతూనే ఉంటుంది! ఆస్థాయిలో పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం వైఎస్సార్ వంతైతే.. వాటిని కాపాడుతూ మరింతగా పెంచుకుంటూ పోతుండటం జగన్ వంతైంది! ఇలాటి కొడుకు ఒక్కడు చాలుగా అన్న మాటల సంగతి అటుంచితే.. జగన్ చిన్నప్పటి ఫోటో ఒకటి వెలుగులోకి వచ్చింది.
తండ్రి పక్కన నిలబడి… “నిత్యం నీ పక్కన నేనుంటాను.. ఒకరికి ఒకరు ఒకరికోసం ఒకరు.. ప్రజలకోసం ఇద్దరూ..” అన్నట్లుగా ఉన్న ఈ ఫోటో ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అవుతుంది. ఈ అరుదైన ఫొటో 1970 – 80ల మధ్యకాలంలోనిది అని వైఎస్ఆర్ ఫ్యామిలీ చెబుతోంది.