హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

-

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ కు విరుద్ధంగా వెలువడ్డాయని కీలక వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ స్పందిస్తూ.. హర్యానా ఎన్నికలు కూడా ఆంధ్రప్రదేశ్ తరహాలోనే జరిగాయని అన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నాయని పేర్కొన్నారు.

అభివృద్ధి చెందిన యూకే, యూఎస్, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫ్రాన్స్, జర్మనీ వంటి దేశాలలోనే బ్యాలెట్ పద్ధతి ఉపయోగిస్తున్నారని.. మనం కూడా అదే విధానానికి వెళ్లడం మంచిదన్నారు. కోర్టులో కేసులు పెండింగ్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్ కు, హర్యానా ఎన్నికల ఫలితాలు భిన్నంగా లేవన్నారు. మనలాంటి ప్రజాస్వామ్యంలో, ప్రజాస్వామ్యం ప్రభలంగా ఉండటమే కాకుండా అభివృద్ధి చెందేలా చూడాలన్నారు వైఎస్ జగన్.

చాలా అభివృద్ధి చెందిన దేశాలు పేపర్ బ్యాలెట్ ను ఉపయోగిస్తున్నప్పుడు.. మనం ప్రపంచంలోని ఇతర దేశాలతో మార్పులు చేసి పేపర్ వైపు వెళ్లే సమయం ఇది. బ్యాలెట్, ఇది ఓటర్ల విశ్వాసాన్ని పెంచుతుందన్నారు. విశ్వాసాన్ని నింపేందుకు చట్టసభ సభ్యులు ముందుకు రావాలని ఎక్స్ వేదికగా అన్ని పార్టీలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version