ఆంధ్రప్రదేశ్ లో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ పదవులకు వైసీపీ నాయకత్వం ఇద్దరు నేతల పేర్లను ఖరారు చేసినట్లు టాక్ నడుస్తోంది. నేడో రేపో ఈ ఇద్దరి పేర్లను ప్రభుత్వం గవర్నర్ కు సిఫారసు చేయనుందనే ప్రచారం కూడా ఊపందుకుంది. గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీ పదవులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ రెండు పదవుల్లో ఒక పదవిని ఎస్సీ సామాజిక వర్గానికి, మరో పదవిని మైనార్టీలకు ఇవ్వాలని వైసీపీ నాయకత్వం నిర్ణయం తీసేసుకుందని కూడా సమాచారం! అయితే ఏపీలో ఎలాంటి పదవులు ఖాళీ అయినా అవి పక్కా లెక్క ప్రకారం.. భవిష్యత్తు వ్యూహాన్ని రచిస్తూ వైఎస్ జగన్ నిర్ణయం తీసుకుంటున్న సంగతి తెలిసిందే!
అందులో భాగంగా ఈసారి ఏపీలో ఎస్సీ సామాజికవర్గానికి చెందిన పండుల రవీంద్రబాబు, మైనార్టీ వర్గానికి చెందిన జకియా ఖానుం ల పేర్లను ప్రభుత్వం గవర్నర్ కు ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది. కాగా 2019 ఎన్నికల ముందు అప్పట్లో టీడీపీ ఎంపీగా ఉన్న ఎంపీ పండుల రవీంద్రబాబు వైసీపీలో చేరారు. అయితే అప్పుడే ఎంపీ టికెట్ ఇవ్వమని చెప్పినప్పటికీ… తప్పక న్యాయం చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈ మేరకు ఇప్పుడు ఆయనకు ఈ పదవి ఇస్తున్నట్టు తెలుస్తోంది.
అలానే కడప జిల్లాకు చెందిన జకియా ఖానుం భర్త పార్టీ కోసం పని చేస్తూ మృతి చెందారు. అందుకే ఆమెకు ఆ పదవి ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఫైనల్ గా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది వేచి చూడాలి. సహజంగా ఏ పార్టీలోనైనా.. గవర్నర్ కోటాకు చెందిన పదువులను అంతా ధనికులకు ఇచ్చి ఆ రకంగా సొమ్ము చేసుకొని పార్టీకోసం ఆ డబ్బును వినియోగుంచేస్తుంటారు. ఇన్నాళ్లు అలాంటి వ్యాపారమే చంద్రబాబు చేసి చివరికి అవస్థలు పాలై.. అలా సంపాదించిన రాజ్యసభ సీట్లు కూడా బీజేపీలోకి వెళ్తున్నా.. బాబు అలా నోరు మెదపకుండా చూస్తూ ఉండాల్సి వచ్చింది. మొత్తానికి ఇలాంటి సమయంలో ఎస్సీ, మైనార్టీలకు గవర్నర్ కోటాలో సీట్లు ఇస్తే.. జగన్ నిర్ణయం ఏపీలో ఇది మరో సంచలనమే అవుతోంది.