ప్రముఖ ఆడిటింగ్ సంస్థ బ్రహ్మయ్య అండ్ కంపెనీలో సీనియర్ పార్ట్‌నర్, టీటీడీ మాజీ చైర్మన్ దేవినేని సీతారామయ్య (96) అనారోగ్యంతో కన్నుమూశారు. సీతారామయ్య కొంతకాలంగా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్నారు. హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ కు సీతారామయ్య సన్నిహితుడు, సీతారామయ్యకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు.
A close confidante of NT Rama Rao Garu & a mentor figure for me, Devineni Seetharamaiah Garu’s demise is a personal loss. Over the years, I’ve had many beautiful conversations with him & have learned valuable lessons that will live with me. The Nara Family will miss him! pic.twitter.com/NIRPPdUEY0
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) July 19, 2020
అయితే సీతారామయ్య మృతికి ఏపీ మాజీ చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితులని, టీటీడీ ఛైర్మన్ గా దేవినేని సీతారామయ్య సేవలు అందించారని చంద్రబాబు కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసినట్లు చంద్రబాబు చెప్పారు. కాగా, నారా లోకేశ్ కూడా దేవినేని సీతారామయ్య మృతి పట్ల తీవ్రంగా చలించిపోయానని వెల్లడించారు.