కరణం ధర్మశ్రీ – విజయసాయి రచ్చ.. ఇంటికి పిలిపించుకున్న జగన్

విశాఖ డిఆర్సి మీటింగ్ లో విజయసాయి రెడ్డి, ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మధ్య జరిగిన రచ్చ పై ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సీరియస్ అయ్యారని అంటున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి, అమర్నాథ్, కరణం ధర్మశ్రీ ని తాడేపల్లి పిలిపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వారితో భేటీ అవనున్నారు. హుటా హుటిన విశాఖ నుండి విజయసాయి రెడ్డి, అమర్నాథ్, ధర్మశ్రీలు బయల్దేరి వెళ్లారు. డిఆర్సి మీటింగ్లో విజయసాయి వ్యాఖ్యల మీద బహిరంగంగా అసహనం వ్యక్తం చేశారు ధర్మశ్రీ.

నాడు నేడు లో నిధులు దుర్వినియోగం అవుతున్నాయని చెప్పిన అమర్నాథ్ తో పాటుగా, పరోక్షంగా ధర్మశ్రీ చెందినటువంటి భూములు విషయాన్ని ప్రస్తావించారు విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో ధర్మ శ్రీ సీరియస్ అయి కామెంట్స్ చేశారు. దీంతో రచ్చ రేపింది. ఈరోజు జరిగే ఈ సమావేశానికి మంత్రి అవంతి, కన్నబాబు, తో పాటుగా అందుబాటులో ఉన్న జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యే అవకాశం ఉందని అంటున్నారు. ఇప్పటికే ఈ విషయం పైన, విశాఖ జిల్లా ఇంఛార్జి మంత్రి కన్నబాబు తో సమావేశమై జగన్ వివరాలు తెలుసుకున్నట్టు చెబుతున్నారు.