YS Jagan Visit Pinneli Ramakrishna Reddy in Nellore Jail: రేపు జైలుకు వైఎస్ జగన్ వెళ్లనున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రేపు నెల్లూరు జైలు కు వెళ్లనున్నారు. అక్కడ సెంట్రల్ జైలులో ఉన్న మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పరామర్శించనున్నారు.
నిన్న బెంగళూరు నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్…రేపు నెల్లూరు జైలు కు వెళ్లనున్నారు. టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసం చేసిన కేసుల్లో పిన్నెల్లి జైలుకు వెళ్లిన సంగతి తెలిసిందే.
–ఇది ఇలా ఉండగా…వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ నిన్న ఏపీలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ గారికి ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు, నేతలు.