జగన్ – చంద్రబాబు: తేడా సులువుగా చెప్పే ఉదాహరణ ఇది!

-

ఎలాంటి పరిస్థితులు ఎదురైనా.. ప్రజలను ముందుండి నడిపించేవాడు నాయకుడు. సమస్యలు చుట్టుముట్టినప్పుడు “నేనున్నాను” అని భరోసా ఇచ్చేవాడు నాయకుడు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు అప్పు చేసైనా వారి సమస్యలు తీర్చేవాడు సిసలైన సేవకుడు. ప్రజల కష్టమే తన కష్టం అని భావిస్తూ… సమస్యల్లో వారికి మానసిక ధైర్యం కలిగించేవాడు సమర్ధవంతమైన నాయకుడు! ఇవన్నీ జగన్ లో ఉన్నాయని చెప్పే సంఘటన కరోనా రూపంలో మరోసారి వెలుగులోకి వచ్చింది!

ప్రపంచంతో పాటు, దేశంలోని అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీలో కరోనా రోజు రోజుకీ పెరిగిపోతుంది. రోజు రోజుకి పెరిగిపోతున్న టెస్టుల సంఖ్యకు అనుగుణంగా.. పాజిటివ్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి. ఈ సమయంలో జగన్ పారిపోలేదు.. దాక్కోలేదు! కరోనా ఒక సమస్య.. దానికి మనోధైర్యం.. స్వీయ సంరక్షణే పరిష్కారాలు అని చెబుతూ.. తాను పాటిస్తూ.. పాలన సాగిస్తున్నారు. క్వారంటైన్ ముగించుకుని ఇంటికి వెళ్లిన వారికి మూడు వేల సాయం అందిస్తున్నారు. మరణించిన వారి అంత్యక్రియలకు పదిహేనువేల రూపాయలు ఇస్తున్నారు!

మరి బాబు ఏమి చేశారు! కరోనా వచ్చింది అని తెలియగానే… అమరావతి లేదు, ఆంధ్ర ప్రదేశ్ లేదు అంటూ హైదరబాద్ కి వెళ్లిపోయారు. గదిలోకి వెళ్లి తలుపులేసేసుకున్నారు. ఆ సమయంలో రాష్ట్రంలో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.. ఆ సమయంలో సమర్ధవంతమైన ప్రభుత్వం ఉంది కాబట్టి సరిపోయింది.. లేదంటే ఇలాంటి బాధ్యతారాహిత్యం ఉన్న ప్రతిపక్ష నాయకుడిచేతిలో రాష్ట్రం ఏమైపోయేది! జూం ఉంది కదా అని ఆన్ లైన్ లోకి రావడం.. ప్రభుత్వంపై విమర్శలు చేయడం.. తనగురించి నాలుగు ముక్కలు కొట్టుకోవడం.. అనంతరం షట్ డౌన్ చేసేయడం!

సరే పెద్దాయన, పెద్ద వయసులో ఆయన నుంచి అంతకుమించి ఆశించడం కూడా అత్యాశవుతుంది భావిస్తోన్న తరుణంలో… కరోనా అరికట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, తాను ముందే హెచ్చరించానంటూ బీరాలు పలకడం దేనికి! కరోనాపై ప్రజల్లో భయాందోళనలు ఉన్నమాట వాస్తవం. ఇలాంటప్పుడు వీలైతే నాలుగు మాటలు చెప్పి ప్రజల్లో ధైర్యం నింపాలి తప్ప… నోటికొచ్చిన విమర్శలు చేసి రాజకీయంగా మనుగడ కాపాడుకోవడానికి కరోనాను వాడుకోవడాన్ని ఎలా చూడాలి!

కరోనా అని తెలియగానే ప్రజలను పకనపెట్టి… పక్కరాష్ట్రానికి లగెత్తి దాక్కొన్న బాబుకు.. అసలు ఏపీలో కరోనా గురించి ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక్క అర్హత ఉన్నదా అన్నది ఇక్కడ పెద్ద ప్రశ్న! బాబుకే తెలియాలి అనేది సమాధానం!!

Read more RELATED
Recommended to you

Exit mobile version