నేడు దిల్లీకి వైఎస్ షర్మిల.. కాంగ్రెస్ లో చేరిక

-

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ దిల్లీకి వెళ్లనున్నారు. కొద్దిరోజులుగా ఆమె తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే ఉహాగానాలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా షర్మిల అదంతా నిజమేనని తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నానని స్వయంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీతో కలిసి పని చేసే విషయంలో పలు విషయాలు చర్చించేందుకు ఇవాళ ఆమె దిల్లీ వెళ్తున్నారు.

ఈరోజు మొదట తన సోదరుడు, సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటికి వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కిలిసి జగన్ ఇంటికి వెళ్లి వారి పెళ్లి ఆహ్వాన పత్రికను అందజేయనున్నారు. అక్కడి నుంచి ఆమె దిల్లీ వెళ్లనున్నారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేసేందుకు దిల్లీలో ఆ పార్టీ అధిష్ఠానాన్ని కలుస్తానని షర్మిల చెప్పారు. తాము తెలంగాణలో అభ్యర్థులను నిలబెట్టకపోవడం వల్లే 31 చోట్ల కాంగ్రెస్ గెలిచిందని అన్నారు. తన త్యాగానికి కాంగ్రెస్ కృతజ్ఞత చూపిందని, అందుకే పార్టీలోకి ఆహ్వానించారని షర్మిల వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version