ఇంకా అమెరికాలోనే వైఎస్ విజయమ్మ ఉన్నారు. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల ప్రకటించారు. తన తల్లి కాస్త రిలాక్స్ కావడం కోసం…అమెరికా వెళ్లారన్నారు. బీజేపీ అధికారంలో వస్తే 4 శాతం రిజర్వేషన్లు మాయం అవుతాయని హెచ్చరించారు వైఎస్ షర్మిల. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీ కి ఓటు వేద్దామా ? ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో జగన్ పార్టీకి ఓటు వేసినా బీజేపీకి వేసినట్లేనని ఫైర్ అయ్యారు.

పార్లమెంట్‌లో బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు జగన్, చంద్రబాబు మద్దతు తెలిపారన్నారు. బీజేపీ మళ్ళీ కేంద్రంలో అధికారంలో వస్తే ముస్లింలకు భద్రత ఉండదని సూచనలు చేశారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. కేంద్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముస్లింలకు అండగా ఉంటుందన్నారు.