మాజీ మంత్రి వై.యస్. వివేకానంద రెడ్డి సతీమణి వై.యస్. సౌభాగ్యమ్మ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారని రఘురామకృష్ణ రాజు పేర్కొన్నారు. ఆమె కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారా? లేదా?? అన్నదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అన్నారు.
టీడీపీ – జనసేన మధ్య పొత్తును విచ్ఛిన్నం చేయాలని సాక్షి దినపత్రిక చేయని ప్రయత్నం అంటూ లేదని, టీడీపీతో పొత్తులో భాగంగా సీట్ల వ్యవహారంపై సీనియర్ నాయకులు చేగొండి హరి రామ జోగయ్య గారు పవన్ కళ్యాణ్ గారికి రాసిన లేఖ సారాంశాన్ని సాక్షి దిన పత్రిక మొదటి పేజీలో ప్రచురించి తన అత్యుత్సాహాన్ని చాటుకుందని అన్నారు.
పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన వార్తలను లోపలి పేజీలో వేసే సాక్షి దినపత్రిక యాజమాన్యం, హరి రామ జోగయ్య గారు రాసిన లేఖ సారాంశాన్ని మాత్రం ఫస్ట్ పేజీలో ముద్రించడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది ప్రజలందరికీ తెలుసునని అన్నారు. సాక్షి దినపత్రిక ఎన్ని విభేదాలను సృష్టించాలని భావించినా ప్రజల కోసం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇరువురు సఖ్యతగానే ఉంటారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.