పేద తల్లిదండ్రులు వారి పిల్లలను ఉన్నత చదువులు చదివించే విధంగా అన్ని విధాలుగా సహాయపడుతున్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పేద పిల్లల వివాహానికి గౌరవప్రదంగా జరిపించేలా వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా సాయాన్ని అందిస్తున్నారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికానికి అందిస్తున్న ఈ సాయాన్ని తాజాగా అందించారు.
గత ఏడాది అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు మూడు నెలల్లో పెళ్లి చేసుకున్న అర్హులైన 10, 132 జంటలకు వైయస్సార్ కళ్యాణమస్తు వైయస్సార్ షాది తోఫా కింద 78.53 కోట్ల ఆర్థిక సాయాన్ని సీఎం వైయస్ జగన్ తాాజాగా తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు. వైఎస్సార్ కళ్యాణమస్తు, షాది తోఫా ద్వారా పేదలకు మేలు జరగడంతో పాటు.. బాల్యవివాహాలు తగ్గించడం, అక్షరాస్యత పెంచడం ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఏపీ సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించినట్టు తెలిపారు.