YSR Law Nestham : వైయస్సార్ లా నేస్తం రెండో విడత నిధులను ఇవాళ సీఎం జగన్ యువ న్యాయవాదుల అకౌంట్లలో జమచేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 2,807 మంది అర్హులు ఉన్నారు. వారికి నెలకు రూ. 5,000 చొప్పున 6 నెలల స్టైపెండ్ రూ. 30,000 జమ చేస్తారు.
ఇందుకుగాను ప్రభుత్వం మొత్తం రూ. 7,98,95,000 కోట్లు వెచ్చిస్తోంది. కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారికి మూడేళ్ల పాటు ఏడాదికి రూ. 60,000 రెండు విడతల్లో ప్రభుత్వం అందిస్తోంది. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో నిలదొక్కుకునేలా 3 ఏళ్ల పాటు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60,000 చొప్పున రెండు దఫాల్లో చెల్లిస్తూ, మూడేళ్లకు మొత్తం రూ. 1,80,000 స్టైఫండ్ అందిస్తున్న జగనన్న ప్రభుత్వం..ఈ సారి కూడా అలాగే అందించనుంది.