కాంగ్రెస్ మరో సంచలన నిర్ణయం.. 54 కార్పొరేషన్ల చైర్మన్ల నియామకాలు రద్దు

-

గత ప్రభుత్వ హయాంలో వివిధ కార్పొరేషన్లకు చైర్మన్, వైస్ చైర్మన్ లుగా నామినేట్ పద్దతిలో నియమితులైన పోస్టులన్నింటినీ రద్దు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈనెల 07వ తేదీ నుంచి ఇవి అమలులోకి వస్తున్నట్టు ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదివారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఆఫీసుల్లో పీఏ, పీఎస్, ఓఎస్డీలుగా పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు వారి సొంత డిపార్ట్ మెంట్ లోకి వెళ్లిపోవాలని స్పష్టం చేశారు.

కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ పద్దతిలో నియమితులైన ఆఫీస్ సబార్టినేట్ స్టాప్ ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడటంతోనే చాలా మంది రాజీనామా చేసినా ఇంకా కొందరూ కొనసాగుతూ ఉండటంతో ఈ ఉత్తర్వులు భారీ అయ్యాయి. రాష్ట్రంలోని 54 కార్పొరేషన్ల చైర్మన్లు, వైస్ చైర్మన్ల పోస్టులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించడంతో వారు రాజీనామా చేయకుండానే ఇంటి బాట పట్టాల్సి వస్తుందని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్, టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ లతో పాటు మొత్తం 54 మంది పదవులు రద్దయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news