ఆంధ్రప్రదేశ్ లో కరోనా కట్టడి విషయంలో సిఎం జగన్ కి వైసీపీ నేతలు తలనొప్పిగా మారిపోయారా…? ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ విషయం అందరికి స్పష్టంగా అర్ధమవుతుంది. అయినా సరే వైసీపీ నేతల తీరు మాత్రం మారడం లేదు అనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది. ఏపీలో పరిస్థితి మీద కేంద్రం ఆరా తీస్తున్నా సరే లాక్ డౌన్ ని మాత్రం వైసీపీ నేతలు పాటించడం లేదు.
ఇది సిఎం జగన్ కి పెద్ద తల నొప్పిగా మారింది. ఎన్ని విధాలుగా చెప్తున్నా సరే వైసీపీ నేతలు మాత్రం తమకు నచ్చిందే చేయడం విడ్డూరంగా మారింది. సేవా కార్యక్రమాల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు.అందరిని ఒక చోటకు రమ్మని చెప్పి వారికి సరుకులు పంపిణి చేయడం ఒకటి అయితే డబ్బులు ఇచ్చే విషయంలో కేంద్రం ఇచ్చేవి కూడా తాము ఇస్తున్నట్టు చెప్పడం. ఇప్పుడు మీడియా ఎక్కువగా అందుబాటులో ఉంది.
జనాలకు దాదాపుగా వాస్తవాలు తెలుస్తున్నాయి. ఈ సమయంలో ఈ అనవసర ప్రచారం ఎందుకు అనే భావన లో సిఎం వైఎస్ జగన్ ఉన్నారు. వద్దు అని మంత్రులకు ఆయన సూచనలు చేసినా సరే కొందరు ఎమ్మెల్యేలు మాత్రం తమకు నచ్చిన విధంగా వ్యవహరించడం ఇప్పుడు చికాకుగా మారింది. క్వారంటైన్ లో తమ బంధువులు ఉన్నారని ఒక ఎమ్మెల్యే మంత్రితో గొడవ పడటం గమనార్హం.
దీనిపై పెద్ద దుమారమే చెలరేగింది. ఉంటే ఏమవుతుంది అనే ప్రశ్న కూడా వినపడింది. మారకపోతే కష్టమని జగన్ చెప్తున్నా వినడం లేదు. విజయసాయి రెడ్డి విశాఖలో నిర్వహించే కార్యక్రమాల మీద జగన్ కూడా కాస్త అసహనంగానే ఉన్నారని సమాచారం. అనవసరంగా కేసులు పెరుగుతాయని ఇప్పటికే ఇబ్బంది పడుతున్నామని చెప్పినా విజయసాయి మాత్రం ఆగడం లేదట. దీనితో చర్యలు తీసుకోవాలి కొందరి మీద అనే భావనలో జగన్ ఉన్నారట.