ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గింది. ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన కరోనా బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కేవలం 101 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నిర్ధారణ అయ్యాయి. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. 9,008 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగ రాష్ట్రంలో నేటి వరకు మొత్తం 2318054 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.
అలాగే నేడు రాష్ట్రంలో కరోనా వైరస్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించ లేదు. థర్డ్ వేవ్ వచ్చిన తర్వాత ఒక్క రోజులో కరోనా మరణాలు సంభవించక పోవడం ఇదే తొలి సారి. కాగ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్ నుంచి 458 మంది బాధితులు పూర్తిగా కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇంకా..1,657 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా థర్డ్ వేవ్ దాదాపు ముగిసిట్టే. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలను ఎత్తివేసింది. కానీ కరోనా నిబంధనలను పాటించాలని సూచించింది.