ఆండ్రాయిడ్ 12 వ‌చ్చేస్తోంది.. అందులో ల‌భ్యం కానున్న ఫీచ‌ర్లు ఇవే..!

-

సాఫ్ట్‌వేర్ సంస్థ గూగుల్ త‌న ఆండ్రాయిడ్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌కు గాను ఎప్ప‌టిక‌ప్పుడు నూత‌న ఫీచ‌ర్ల‌ను అందిస్తున్న విష‌యం విదితమే. ఆండ్రాయిడ్ లో కొత్త వెర్ష‌న్‌ల‌ను విడుద‌ల చేయ‌డంతోపాటు వాటిల్లో సౌక‌ర్య‌వంత‌మైన ఫీచ‌ర్ల‌ను గూగుల్ యూజ‌ర్ల‌కు అందిస్తోంది. ఇక త్వ‌ర‌లోనే ఆండ్రాయిడ్ 12 ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను కూడా విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలోనే గూగుల్ ఈ ఓఎస్‌కు చెందిన బీటా 1 అప్ డేట్‌ను తాజాగా విడుదల చేసింది. దీంతో ఆండ్రాయిడ్ 12 లో ల‌భ్యం కానున్న ఫీచ‌ర్ల వివ‌రాలు వెల్ల‌డ‌య్యాయి. మ‌రి ఆ ఫీచ‌ర్లు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

android 12 coming soon these are the features

ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌లో ఫోన్ ను క‌స్ట‌మ్ క‌ల‌ర్ ప్యాలెట్‌, రీడిజైన్డ్ విడ్జెట్స్‌తో పర్స‌న‌లైజ్ చేసుకోవ‌చ్చు. విడ్జెట్‌ల‌ను కూడా రీడిజైన్ చేశారు. అందువ‌ల్ల అవి ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తాయి. అలాగే విడ్జెట్ల‌కు గూగుల్ అసిస్టెంట్ ను ఉప‌యోగించుకోవ‌చ్చు. ఇక నోటిఫికేష‌న్ షేడ్‌లో క్విక్ సెట్టింగ్స్‌, ప‌వ‌ర్ బ‌ట‌న్‌ను రీడిజైన్ చేశారు. అలాగే సెట్టింగ్స్ విండోను స్ట్రెచ్ చేసుకునే విధంగా స్ట్రెచ్ ఓవ‌ర్ స్క్రోల్ అనే ఫీచ‌ర్‌ను అందిస్తున్నారు.

ఆండ్రాయిడ్ 12లో యూజ‌ర్లకు నాణ్య‌మైన ఆడియో ల‌భిస్తుంది. అందుకు పలు మార్పులు చేశారు. అలాగే కొత్త‌గా ప్రైవ‌సీ డ్యాష్‌బోర్డ్‌ను అందిస్తున్నారు. దీంతో యాప్ ప‌ర్మిష‌న్ల‌ను వేగంగా మార్చుకోవ‌చ్చు. ఫోన్ పైభాగంలో మైక్రోఫోన్‌, కెమెరాల‌ను యాక్సెస్ చేసిన‌ప్పుడు క‌నిపించేలా ఇండికేట‌ర్‌ను అమ‌ర్చారు. దీంతో ఏవైనా యాప్‌ల‌ను ఉపయోగిస్తున్న‌ప్పుడు అవి మైక్రోఫోన్‌, కెమెరాల‌ను యాక్సెస్ చేస్తున్నాయా, లేదా అనే విష‌యం సుల‌భంగా తెలుస్తుంది.

అలాగే లొకేష‌న్ సెట్టింగ్‌లు, నియ‌ర్ బై డివైస్ ప‌ర్మిష‌న్స్ వంటి ఇత‌ర ఎన్నో ఫీచ‌ర్ల‌ను ఆండ్రాయిడ్ 12లో అందివ్వ‌నున్నారు. అయితే ప్ర‌స్తుతానికి బీటా వెర్ష‌న్ అందుబాటులోకి వ‌చ్చింది. కానీ పూర్తి స్థాయి ఓఎస్‌ను గూగుల్ సెప్టెంబ‌ర్‌లో లాంచ్ చేయ‌నున్న‌ట్లు తెలిసింది. ఇక గూగుల్ పిక్స‌ల్ ఫోన్ల‌ను వాడేవారు ఆండ్రాయిడ్ 12 బీటా వెర్ష‌న్‌ను డౌన్ లోడ్ చేసుకుని ఉప‌యోగించ‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news