డబ్బులకి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే వీటిని మరచిపోవద్దు..!

-

చాలా మంది ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. నిజానికి డబ్బు నిలవాలన్నా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు కలుగకుండా ఉండాలి అన్నా వీటిని అసలు మర్చిపోకూడదని ఆచార్య చాణక్య చెప్పారు. జీవితంలో డబ్బుకు ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆనేది చాణక్య నీతి ద్వారా చాణక్య తెలియజేశారు మరి వాటి కోసం ఇప్పుడు చూద్దాం.

 

చాణక్య నీతి ప్రకారం చూస్తే శత్రువులు ఉపకారం ద్వారా పొందిన డబ్బులు ఎక్కువ కాలం నిలవదు అని అన్నారు. అలానే నైతిక విలువలు వదిలేయడం ద్వారా వచ్చే డబ్బు కూడా ఎక్కువ రోజులు ఉండదని చెప్పారు చాణక్య. ఇటువంటి డబ్బులు సమస్యను సృష్టిస్తుంది కానీ మంచి చేయదని చెప్పారు.

అలానే దానధర్మాలను నెరవేర్చడంలో ఉన్న ప్రాముఖ్యత గురించి కూడా చాణిక్య తెలిపారు. మనిషి తన సామర్థ్యాన్ని అనుసరించి దానధర్మాలు చేస్తే మంచిదని కానీ పరిమితికి మించి విరాళాలు ఇవ్వడం వల్ల ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయని చెప్పారు.

డబ్బు సంపాదించిన తర్వాత దానిని పొదుపు చేయకపోతే కష్ట కాలం రావడానికి ఎంతో సమయం పట్టదు అని కూడా చెప్పారు.

అలాగే డబ్బును ఇష్టానుసారంగా ఖర్చు చేస్తే అప్పుడు ఇతరుల ముందు చేతులు చాపాల్సి వస్తుందని చెప్పారు. అందుకని డబ్బు ఖర్చు చేయడంతో పాటు భవిష్యత్తు కోసం డబ్బులు పొదుపు చేయడం చాలా అవసరం.

గౌరవం, ఉద్యోగం, విద్యా, వ్యాపారం లేని చోట నివసించే కూడదు ఎందుకంటే అలాంటి చోట డబ్బు సంపాదించడం కష్టం. కనుక డబ్బుకి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే వీటిని మర్చిపోకండి.

Read more RELATED
Recommended to you

Latest news