జాని మాస్టర్‌కి డైరెక్టర్ అనిల్ రావిపూడి స్ట్రాంగ్ వార్నింగ్!

-

టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు డైరక్టర్ అనిల్ రావిపూడి. దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా అనిల్ రావిపూడి ఉండటం విశేషం. ఈయన తెరకెక్కించిన ‘F2, రాజా ది గ్రేట్, పటాస్,సరిలేరు నీకెవ్వరు’ మూవీస్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేశాయి.

ఇక ఎఫ్ 2కు సీక్వెల్ గా తెరకెక్కించిన F3 ఈ నెల 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ ఫుల్ బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. గత వారం ‘క్యాష్’ ప్రోగ్రామ్ లో సందడి చేసిన అనిల్ రావిపూడి..ఈ టీవీ లో ప్రసారమయ్యే ‘ఢీ, ఎక్స్ట్రా జబర్దస్త్’ ప్రోగ్రాంలకూ గెస్ట్ గా వెళ్లాడు.

‘ఢీ’ ప్రోగ్రామ్ లో అయితే అదిరిపోయే డాన్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఈ క్రమంలోనే జాని మాస్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రజెంట్ సోషల్ మీడియాలో బాగా వైరలవుతోంది. సదరు వీడియోలో జాని మాస్టర్ ను తనకు ఎదురు మాట్లాడొద్దు అంటూ అనిల్ రావిపూడి పంచులు వేయడంతో పాటు అసలు డ్యాన్స్ అంటే ఇదేనా? అని జాని మాస్టర్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ప్రోమో చూస్తుంటే ఇదంతా ఫన్నీగా సాగినట్లు స్పష్టమవుతోంది. అసలేమైంది? అనేది ఇంకా పూర్తిగా తెలియాలంటే ఈటీవీలో ప్రసారమయ్యే ‘ఢీ’ ప్రోగ్రాం ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news