‘‘పడాయివీరన్’’ అనే హీరోయిన్ గా కెరీర్ స్టార్ చేసింది అందాల ముద్దుగుమ్మ అమృత అయ్యర్. ‘‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా’’ సినిమాతో తెలుగు చిత్ర సీమకు వచ్చింది. ఇందులో ‘‘నీలి నీలి ఆకాశం’’ పాటతో బాగా ఫేమస్ అయిపోయింది ఈ సుందరి.
అమృత సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండబోదు. కానీ, ఇటీవల కాలంలో తనకు సంబంధించిన అప్ డేట్స్ అప్పుడప్పుడు ఇస్తోంది. లేటెస్ట్ గా ఇన్ స్టా గ్రామ్ లో లైట్ ఆరెంజ్ కలర్ శారీలో దిగిన ఫొటోలు షేర్ చేసింది.
సదరు ఫొటోల్లో సంప్రదాయానికి ప్రతీక అయిన చీరకట్టులో కుందనపు బొమ్మలా మెరిసిపోతోంది ఈ సుందరి. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు ‘‘ఏం మాయ చేశావే’’ సినిమాలో సమంతలా ఉన్నావంటు కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. శారీలో స్లీవ్ లెస్ జాకెట్ ధరించి అలా చూపులతో పాటు నవ్వుతో ఆకట్టుకుంటోంది అమృత..ప్రస్తుతం ఈ అమ్మడు ‘‘హనుమాన్, గ్రామాయణ’’ సినిమాలలో నటిస్తోంది. హనుమాన్ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తుండగా, గ్రామాయణ ఫిల్మ్ ను దేవనురు చంద్రు డైరెక్ట్ చేస్తున్నాడు.
View this post on Instagram