దుర్గమ్మ సన్నిధిలో బాలయ్య అఖండ టీమ్…!

ప్రస్తుతం థియేటర్ ల వద్ద ఎక్కడ చూసినా బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమా జోరు కనిపిస్తోంది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊచకోత కోస్తోంది. ఈ చిత్రంలో బాలయ్య కు జోడిగా ప్రగ్య జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ఈ చిత్రానికి బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా లో బాలయ్య మాస్ ఫైట్లు…మరియు పాటల్లో తన డ్యాన్స్ తో ఆకట్టుకున్నాడు. ఇక సినిమా సక్సెస్ జోష్ లో ‘అఖండ’ చిత్ర బృందం నేడు విజయవాడ కనక దుర్గమ్మను దర్శించుకుంది.

ఈ సందర్భంగా హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు ఇంద్రకీలాద్రిపై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ ‘అఖండ’ చిత్రం విజయవంతం కావడంతో చిత్ర పరిశ్రమకు ఒక ధైర్యం వచ్చిందని అన్నారు. ఇప్పటికే చిత్ర యూనిట్ తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్న సంగతి తెలిసిందే. అంతే కాకుండా సక్సెస్ మీట్ లు పెడుతూ చిత్ర యూనిట్ విజయానందం లో మునిగి తేలుతోంది.