గతవారం తమిళనాడులో జరిగిన ఎంఐ-17 హెలిక్యాప్టర్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ బుధవారం ఉదయం మృతిచెందినట్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రకటించింది. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ మృతిచెందిన విషయం తెలుపడంపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చింతిస్తున్నదని ప్రకటించారు. డిసెంబర్ 8న జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదం నుంచి తీవ్ర గాయాలతో బయటపడిన ఆయన ఉదయం తుదిశ్వాస విడిచారు. వరుణ్ సింగ్ మృతిపై ఐఏఎఫ్ సంతాపం ప్రకటిస్తున్నది. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం అని ఎయిర్ ఫోర్స్ ఓ ప్రకటనలో తెలిపింది.
గత బుధవారం జరిగిన హెలిక్యాప్టర్ ప్రమదం నుంచి గ్రూప్ క్యాప్టెన్ వరుణ్ సింగ్ తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఆయనకు బెంగళూరులోని సైనిక హాస్పిటల్‌లో చికిత్స అందించారు.
డిసెంబర్ 8న జరిగిన హెలిక్యాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ సహా 13 మంది మృతిచెందిన విషయం తెలిసిందే. వరుణ్ సింగ్ మృతితో ఆ సంఖ్య 14కు చేరుకున్నది.