రాష్ట్రంలో కొవిడ్ టీకాకు భారీ స్పందన లభించడంతో నిల్వలను ప్రభుత్వం సమీకరిస్తుంది. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరో 3 లక్షల కొవిడ్ టీకా డోసులు చేరుకున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న ఎయిర్ ఇండియా విమానంలో రాష్ట్రానికి పూణేలోని సీరం ఇనిస్టిట్యూట్ కు చెందిన కొవిషీల్డ్ టీకాలు చేరుకున్నాయి.
అనంతరం రోడ్డు మార్గంలో తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి వ్యాక్సిన్ ని తరలించారు. వైద్య, ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు వ్యాక్సిన్ వెళ్ళే అవకాశం ఉంది. తాజాగా చేరుకున్న టీకాలతో రాష్ట్రంలో నెలకొన్న కరోనా వ్యాక్సిన్ కొరతకు ఉపశమనం లభిస్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోటి డోసులను అడిగినా సరే కేంద్రం ఇవ్వలేకపోతుంది. మే 1 నుంచి 18 ఏళ్ళు పైబడిన వాళ్లకు వ్యాక్సిన్ అందిస్తారు.