గాంధీ ఆస్పత్రిలో ఇప్పుడు పరిస్థితి దారుణంగా ఉంది. రోగుల వేదనలతో, మృతుల బంధువులతో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. బంధువులు తమ వారిని జాయిన్ చేసుకోవాలని వైద్యులను వేడుకుంటున్నారు. నిన్న రాత్రి 11గంటల నుంచి 2 గంటల వరకు వెయిటింగ్ లో 25కు పైగా అంబులెన్సులు ఉన్నాయి అంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు తో వచ్చిన వారిని తెల్లవారుజామున గాంధీ సిబ్బంది చేర్చుకుంది.
625 ఐసీయూ, 1256 ఆక్సిజన్ బెడ్లు ఫుల్ అయ్యాయి. దీంతో గాంధీ ఫుల్ కెపాసిటీ పూర్తి అయింది. అత్యవసరమైతే తప్ప గాంధీకి రావద్దంటూ వైద్యులు సూచనలు చేస్తున్నారు. బెడ్లు నిండిపోవడంతో కింగ్ కోఠి, టీమ్స్ ఆస్పత్రులకు రిఫర్ గాంధీ సిబ్బంది వెళ్ళాలి అని సూచిస్తున్నారు.