ట్విట్టర్ కు వరుస షాక్‌లు తాకుతున్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మరియు ట్విట్టర్ ల మధ్య వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో… ట్విట్టర్‌ను కేసుల బెడద వదలడం లేదు. ట్విట్టర్‌పై ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు కేసు నమోదు చేశారు. జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ట్విట్టర్ లో బాలల అశ్లీల కంటెంట్ ఉంటోందని ఎన్‌సీపీఆర్ ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఢిల్లీ సైబర్ సెల్ పోలీసులు… ట్విట్టర్‌పై కేసు నమోదు చేశారు.
కాగా… భారత్‌లో అంతర్భాగమైన జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌ను ప్రత్యేక దేశంగా చూపించారని, ఇది ఉద్దేశ పూర్వకమని, రాజద్రోహం కింద కేసులు నమోదు చేయాలని ప్రవీణ్ భాటి అనే భజరంగ్ దళ్ నేత ట్విటర్ ఇండియా చీఫ్‌పై తాజాగా యూపీలోని బులందర్ పహారా పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 505(2), ఐటీ సవరణ చట్టం 2008లోని సెక్షన్ 74 కింద ఎఫైఆర్ నమోదు చేశారు. వారంలో వివరణ ఇవ్వాలని మనీష్‌కు ఆదేశించారు.