ఎన్నికలు అన్యాయమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వాదనను ఫెడరల్ అప్పీల్ కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. తాము ఎన్నికలు మోసం అని చెప్పలేమని స్పష్టం చేసింది. కీలకమైన రాష్ట్రమైన పెన్సిల్వేనియాలో జో బిడెన్ విజయాన్ని అడ్డుకోవడానికి ట్రంప్ ప్రయత్నం చేయడంతో అమెరికా కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో తాను మోసపోయా అని పిటీషన్ వేసారు.
ఆయన చేసిన వాదనలను సమీక్షించిన ముగ్గురు అప్పీల్ కోర్టు న్యాయమూర్తులు ఏకగ్రీవంగా ఆయన చేసే ఆరోపణలకు ఆధారాలు లేవు అని స్పష్టం చేసారు. ఆయన ఆరోపణలు తీవ్రంగా ఉన్నా సరే ఎన్నికలు అన్యాయం అని చెప్పలేమని స్పష్టం చేసారు. ఫిలడెల్ఫియాలో కూడా ట్రంప్ ఇలాగే ఆరోపణలు చేసారు. అయితే ట్రంప్ న్యాయవాదులు మాత్రం తాము సుప్రీం కోర్ట్ కి వెళ్తామని స్పష్టం చేసారు.