దేశంలో గ్యాస్ లీక్ ఘటనలు పెరిగిపోతున్నాయి. విశాఖలో జరిగిన ఎల్జీ పాలిమర్స్ ఘటన మరువక ముందే మరో గ్యాస్ లీక్ ఘటన చోటు చేసుకుంది. మరోసారి గ్యాస్ లీక్ సంభవించి ఇద్దరు మృతి చెందగా మరో నలుగురిని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వివరాల్లోకి వెలితే..విశాఖ లోని పరవాడ ఫార్మాసిటీలో గత రాత్రి 11 గంటల ప్రాంతంలో గ్యాస్ లీక్ సంభవించింది. లీకైన గ్యాస్‌ను బెంజిమెడిజోల్ వేపర్‌గా గుర్తించారు ఇది చాలా ప్రామాధకార వాయువు అని అధికారులు తెలియజేస్తున్నారు. లీక్ అయిన గ్యాస్ ను పీల్వడంతో ఇద్దరు మృతి చెందారు మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. వారిని చంద్రశేఖర్, అనంద్‌బాబు, జానకీరామ్, సూర్యనారాయణగా గుర్తించారు. హెల్పర్ చంద్రశేఖర్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాధామ్ జరిగందని తెలియగానే కలెక్టర్ వినయ్ చంద్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గ్యాస్ లీక్ కు గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నాడు. ఇక మరో గ్యాస్ లీక్ అవ్వడంతో స్థానికులు కంగారూ పడుతున్నారు నిన్న రాత్రంతా ఎవ్వరూ సరైన కునుకు తీయలేకపోయారు.
విశాఖలో మరో గ్యాస్ లీక్..! గజగజా వణికిపోతున్న ప్రజలు..!
-