డార్లింగ్ ఫ్యాన్స్ కి మరో గుడ్ న్యూస్.. ప్రభాస్ న్యూ రికార్డ్.?

-

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ క్రేజ్ ఏ లెవెల్లో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రభాస్ కు అభిమానులు ఏర్పడ్డారు. ఆ తర్వాత విడుదలైన యాక్షన్ మూవీ సాహో సినిమా కూడా ప్రభాస్ అభిమానులను మరింతగా పెంచింది. అంతేకాదు ప్రస్తుతం భారీ బడ్జెట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు రెబల్ స్టార్ ప్రభాస్.

సోషల్ మీడియాలో కూడా ప్రభాస్ కు రోజురోజుకూ క్రేజ్ పెరిగిపోతుంది. పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన రెబల్ స్టార్ ప్రభాస్.. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గానే ఉన్నారు అన్న విషయం తెలిసిందే. తాజాగా ప్రభాస్ ఫేస్బుక్ లో ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు. ఏకంగా రెండు కోట్ల ఫాలోవర్స్ ని సంపాదించుకున్న మొట్టమొదటి సౌత్ ఇండియన్ హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించాడు. ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ లు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news