ఈపీఎఫ్ వో ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి వడ్డీ అమౌంట్..

-

ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది ప్రభుత్వం.ప్రతిసారి వడ్డీ జమ ఆలస్యమవుతూ వస్తోంది..అయితే ఇప్పుడు ఈ ఏడాది లో మాత్రం ఆలస్యం లేకుండా వడ్డీ డబ్బులను సర్కారు జమ చేయనున్నారు..ఈ సంవత్సరం ముందుగానే పీఫ్ ఖాతాదారుల అకౌంట్లో వడ్డీ జమ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.దేశంలో ఏడు కోట్లకు పైగా ఎంప్లాయీస్ ఖాతాల్లో వడ్డీ అమౌంట్ జమ కానుంది. అయితే గతంలో వడ్డీ 8.5 శాతం అందించగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశమై వడ్డీ 8.1 శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ వడ్డీని ఖతాదారుల అకౌంట్లలో ఈ సారి ముందుగానే జమ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే గతంలో కంటే ఈ సారి వడ్డీ శాతాన్ని తగ్గించారు.2012-13 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2013-14 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2014-15 ఆర్థిక సంవత్సరంలో 8.75 శాతం, 2015-16 ఆర్థిక సంవత్సరంలో 8.8 శాతం వడ్డీ చెల్లించారు. 2016-17 సంవత్సరంలో 8.65 శాతం, 2017-18 ఆర్థిక సంవత్సరంలో 8.55 శాతం, 2018-19 ఆర్థిక సంవత్సరంలో 8.65 శాతం, 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం, 2020-21 ఆర్థిక సంవత్సరంలో 8.5 శాతం చొప్పున వడ్డీ జమ చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రం 8.1 శాతానికి కుదించి వడ్డీ జమ చేయనుంది. కాగా ఈపీఎఫ్ వో ఉద్యోగుల ఖాతాల్లో జూన్ 16 నుంచి డబ్బు జమ చేయడం మొదలైంది..

రోజుకు 2.5 నుంచి 5 లక్షల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ అవుతుంది. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.72,000 వేల కోట్ల వడ్డీని జమ చేయనుంది. అయితే ఖాతాదారులు పీఫ్‌ బ్యాలెన్స్‌ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.. మొదటగా ఈపీఎఫ్ వో వెబ్ సైట్ epfindia.gov.in లో ఓపెన్ చేసి ఈ పాస్‌బుక్‌పై క్లిక్ చేయాలి. దీంతో passbook.epfindia.gov.in అనే కొత్త పేజీ ఓపెన్‌ అవుతుంది. ఇక్కడ యూఏఎన్ నంబర్, పాస్ వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేయాలి. ఆ తర్వాత సభ్యుల ఐడీని ఎంచుకుని ఈపీఎఫ్ బ్యాలెన్స్ ని  చెక్ చేసుకోవచ్చు..

Read more RELATED
Recommended to you

Latest news