ఏపీలో రూ. 1500 కోట్లతో భారీ ప్రాజెక్ట్‌ ఏర్పాటు.. 10 వేల మందికి ఉపాధి

-

ఏపీలో మరో భారీ ప్రాజెక్ట్ ఏర్పాటు కానుంది. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం పెదగార్లపాడులో రూ. 1500 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ సిమెంట్‌ ప్లాంట్‌ ఏర్పాటుచేసేందుకు ముందుకొచ్చింది ఓ సిమెంట్ కంపెనీ. ఈ ప్రాజెక్టు 24 నెలల్లో పూర్తిచేసేలా ప్రణాళికలు చేస్తున్నారు. ఇప్పటికే 9 రాష్ట్రాలలో సిమెంట్‌ తయారీ, అనుబంధ రంగాలకు సంబంధించిన ప్లాంట్స్‌ ఏర్పాటు చేసింది శ్రీ సిమెంట్‌ గ్రూప్. శ్రీ సిమెంట్‌ గ్రూప్‌ నుంచి ఏపీలో మొట్టమొదటి ప్రాజెక్ట్ కావ‌డం విశేషం.

ఈ నేప‌థ్యంలోనే.. ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసి చర్చించారు సిమెంట్‌ లిమిటెడ్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్, జేఎండీ ప్రశాంత్‌ బంగూర్‌. ఈ సంద‌ర్భంగా.. శ్రీ సిమెంట్‌ ఎండీ హెచ్‌ఎం.బంగూర్ మాట్లాడుతూ… రాష్ట్రాభివృద్ధికోసం ముఖ్యమంత్రి జ‌గ‌న్‌ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని… ఒక కంపెనీకి చెందిన ముఖ్యకార్యనిర్వాహణాధికారి ఏరకంగా ఆ కంపెనీ బాగోగులు చూసుకుంటారో.. అలాగే రాష్ట్ర బాగోగుల కోసం ముఖ్యమంత్రి కూడా అలాగే పనిచేస్తున్నారని వెల్ల‌డించారు. ప్రజలకు మెరుగైన ఆదాయాలు రావాలని సీఎం ఆకాంక్షిస్తున్నారని… రాష్ట్రంలో పారిశ్రామికీరణ పెద్ద ఎత్తున జరగాలని సీఎం కోరుకుంటున్నారన్నారు. ఈ ప్రాజెక్ట్ కార‌ణంగా ప్ర‌త్య‌క్షంగా, మ‌రోక్షంగా ప‌దివే ల మందికి ఉపాధి కలుగుతుంద‌న్నారు.

Read more RELATED
Recommended to you

Latest news