హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ ప్రతిష్టాత్మక సంస్థ

-

ప్రముఖ ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ “ప్లగ్ అండ్ ప్లే” భారతదేశంలో తన మొదటి కేంద్రాన్ని హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నామని ప్రకటించింది. ఫ్రాన్స్ లో పర్యటిస్తున్న తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తో “ప్లగ్ అండ్ ప్లే” సంస్థ నాయకత్వ బృందం సమావేశమైన తర్వాత ఈ ప్రకటన వెలువడింది. ఫ్రెంచ్ ప్రభుత్వం బిజినెస్ ఫ్రాన్స్‌లు నిర్వహిస్తున్న “యాంబిషన్ ఇండియా” ఈవెంట్ సందర్భంగా ఈ సమావేశం జరిగింది.

అతి పెద్ద ఎర్లీ స్టేజ్ ఇన్నివేటర్ గా, ఆక్సిలరేటర్ గా, ప్రఖ్యాత కార్పొరేట్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ గా పేరొందిన “ప్లగ్ అండ్ ప్లే” నెట్‌వర్క్‌లో ప్లేబుక్ తో పాటు 530కి పైగా ప్రపంచ-ప్రముఖ కార్పొరేషన్‌లు, 35,000 వెటెడ్ స్టార్టప్‌లు ఉన్నాయి. వీటితో పాటు వెంచర్ ఫండింగ్‌లో తొమ్మిది బిలియన్ల అమెరికన్ డాలర్లు సేకరించిన 1,500 యాక్టివ్ పోర్ట్‌ఫోలియో పెట్టుబడులు కూడా ఈ సంస్థలో భాగంగా ఉన్నాయి.

“ప్లగ్ అండ్ ప్లే” సంస్థకు సిలికాన్ వ్యాలీ (అమెరికా), స్టుట్‌గార్ట్ (జర్మనీ), పారిస్ (ఫ్రాన్స్‌), ఒసాకా (జపాన్), షాంఘై (చైనా), వాలెన్సియా (స్పెయిన్), ఆమ్‌స్టర్‌డామ్ (నెదర్లాండ్స్‌) తో పాటు ప్రపంచవ్యాప్తంగా 37 కార్యాలయాలున్నాయి. ఇక దీనిపై కేటీఆర్ స్పందిస్తూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ఓపెన్ ఇన్నోవేషన్ ప్లాట్‌ఫారమ్ అయిన “ప్లగ్ అండ్ ప్లే” సంస్థ హైదరాబాద్‌ లో తమ కార్యాలయాన్ని ప్రారంభించడానికి స్వాగతిస్తున్నామని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news