మరో అల్పపీడనం.. అతి భారీ వర్షాలు కురిసే చాన్స్

-

తెలుగు రాష్ట్రాలకు మరో భారీ ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశాలు మెండుగా ఉన్నాయని సమాచారం. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే.

వర్షాలు ధాటికి జనజీవనం స్తంభించిపోతోంది.ఇంట్లో నుంచి బయటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు.వాహనదారులు అయితే ట్రాఫిక్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టాలని చాలా మంది వేడుకుంటున్నారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు తీవ్రంగా నష్టోపోయిన విషయం తెలిసిందే. నేటికి ముంపు ప్రాంతాల ప్రజలు ఆ వరద సృష్టించిన ప్రళయాన్ని మర్చిపోలేదు. అయితే, మరో అల్పపీడనం గురించి తెలియగానే సామాన్యులు బెదిరిపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news