నటసింహం నందమూరి బాలకృష్ణ కు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎందుకంటే అత్యంత విశ్వసనీయత కలిగిన అభిమాన గణం ఆయన సొంతం. ఇంక రికార్డుల విషయానికి వస్తే ఆయన కున్న రికార్డులు ఇప్పటి తరానికి ఎవరికి లేవు.

మొన్న డిసెంబర్ నెలలో బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీసు ను షేక్ చేయడమే కాకుండా మరోసారి తన స్టామినా ఏంటో నిరూపించారు. అన్ని వర్గాలను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం 2021లో టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి ఘనమైన విజయంతో ముగింపు ఇచ్చిన చిత్రంగా నిలిచింది.

ప్రపంచవ్యాప్తంగా అన్ని ఏరియాల్లో 94.27కోట్ల రూపాయల షేర్ , 156 కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది. బాలయ్య కెరియర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా రికార్డులను నమోదు చేసింది. అంతేకాకుండా ఈ మధ్యన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నిర్మాతకు అత్యంత లాభాలు తెచ్చిన సినిమా కూడా అఖండ చిత్రం కావడం విశేషం.
తాజాగా ఈ చిత్రం అఖండ చిత్రం 100 రోజులు పూర్తి చేసుకుంది. నేరుగా 4 సెంటర్లలతో పాటుగా మిగిలిన 16 కేంద్రాల్లో 3 షోస్ తో మొత్తం మీద 20 కేంద్రాల్లో శతదినోత్సవం పూర్తి చేసుకుంది.