ప్ర‌యాణికుల‌కు అలర్ట్.. నేడు, రేపు 36 ఎంఎంటీఎస్ రైళ్లు ర‌ద్దు

-

హైద‌రాబాద్ మ‌హా న‌గ‌రంలోని ఎంఎంటీస్ ప్ర‌యాణికుల‌కు అలర్ట్. నేడు, రేపు రెండు రోజుల పాటు 36 ఎంఎంటీఎస్ స‌ర్వీస్ ల‌ను ర‌ద్దు చేస్తున్న‌ట్టు దక్షిణ మ‌ధ్య రైల్వే అధికారులు ప్ర‌క‌టించారు. మార్చి 12, 13 తేదీల్లో 36 ఎంఎంటీఎస్ స‌ర్వీస్ లు ర‌ద్దు చేస్తాన్న‌ట్టు తెలిపారు. హైద‌రాబాద్ – లింగంప‌ల్లి, లింగంప‌ల్లి – హైద‌రాబాద్, ఫ‌ల‌క్ న‌మా – లింగంప‌ల్లి, లింగంపల్లి – ఫ‌ల‌క్ న‌మా మార్గాల్లో ఎంఎంటీఎస్ రైళ్ల స‌ర్వీసులు అందుబాటులో ఉండ‌వ‌ని తెలిపారు.

దీంతో ఈ మార్గాల్లో ఎంఎంటీఎస్ కాకుండా ఇత‌ర మార్గాల ద్వారా ప్ర‌యాణించాల‌ని సూచించారు. హైద‌రాబాద్ – లింగంప‌ల్లి, లింగంప‌ల్లి – హైద‌రాబాద్ మార్గాల్లో 9 ఎంఎంటీఎస్ రైళ్ల చొప్పున ర‌ద్దు అయిన‌ట్టు తెలిపారు. అలాగే ఫ‌ల‌క్ న‌మా – లింగంప‌ల్లి, లింగంప‌ల్లి – ఫ‌ల‌క్ న‌మా మార్గాల్లో 8 ఎంఎంటీఎస్ రైళ్ల చొప్పున ర‌ద్దు అయినట్టు ప్ర‌క‌టించారు.

అలాగే సింకింద్ర‌బాద్ – లింగంప‌ల్లి మార్గంలో ఒకటి, లింగంపల్లి – సికింద్ర‌బాద్ మార్గంలో మ‌రొక ఎంఎంటీస్ స‌ర్వీస్ ల‌ను ర‌ద్దు చేసినట్టు తెలిపారు. కాగ ఈ వివ‌రాల‌ను దక్షిణ మ‌ధ్య రైల్వే ట్విట్ట‌ర్ ద్వారా తెలిపింది. అలాగే ఈ ట్వీట్ లో ర‌ద్దు చేసిన ఎంఎంటీఎస్ రైళ్ల వివ‌రాల‌ను కూడా జోడించింది.

Read more RELATED
Recommended to you

Latest news