కష్టాల్లో ఏపీ.. మరో రూ.2 వేల కోట్ల అప్పు చేసిన జగన్ ప్రభుత్వం !

-

జగన్‌ మోహన్‌ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంకు సెక్యూరిటీల వేలం ద్వారా రూ.2 వేల కోట్ల రుణం సేకరించింది. 7.54% వడ్డీపై ఆరేళ్ల కాలానికి రూ. 1000 కోట్లు, 10 ఏళ్ల కాలానికి 7.59% వడ్డీ పై రూ. 1000 కోట్లు తీసుకుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చివరి త్రైమాసికానికి రూ. 21 వేల కోట్ల కొత్త అప్పులకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరగా, రూ. 4,557 కోట్లకే అనుమతి లభించింది. ఇందులో రూ.2వేల కోట్లను మంగళవారం సెక్యూరిటీల ద్వారా సేకరించింది. సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు జగన్‌ సర్కార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news