పాలకూర మంచిదే..కానీ అధికంగా తింటే ఎన్నో సమస్యలకు మూలం అవుతుందట..!!

-

ఆకుకూరలన్నీ ఆరోగ్యానికి మంచివే.. ముఖ్యంగా తోటకూర, పాలకూర, బచ్చలికూర వీటితో పప్పు చేస్తే కమ్మగా ఉంటుంది. కడుపునిండా తినేస్తాం.. పాలకూరలో విటమిన్-సి, కాల్షియం, ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలకూర అన్ని విధాలుగా ప్రయోజనకరంగా ఉంటుందని అంటారు.. కానీ పాలకూర అధికంగా తింటే కొన్ని నష్టాలు కూడా ఉన్నాయట.. పాలకూరను అధికంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటంట.

Spinach

నిత్యం పాలకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడటమే కాకుండా అనేక ఇతర సమస్యలు వస్తాయి. పాలకూరలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది మూత్రంలో కాల్షియం విసర్జనను ప్రోత్సహిస్తుంది. ఇది ఆరోగ్యానికి హానికరం అని నిపుణులు అంటున్నారు. పాలకూరలో ఆక్సలేట్ మొత్తం ఎక్కువగా ఉంటుంది. దానిని ఎక్కువసేపు తీసుకోవడం వల్ల కిడ్నీ స్టోన్ సమస్యలు వస్తాయి. పాలకూరలో ఉండే విటమిన్-కె రక్తాన్ని పలుచన చేసే మందులతో కలిపి హాని కలిగిస్తుంది.
పాలకూరలో ఆక్సలేట్ సమ్మేళనాలు ఉంటాయి. వీటిని అధికంగా తీసుకుంటే రాళ్లు ఏర్పడటానికి దోహదం చేస్తుంది. మూత్రంలో ఆక్సలేట్ పరిమాణం పెరగడం వల్ల ఈ రాయి ఏర్పడుతుందట… మూత్రపిండ రాళ్లలో అత్యంత సాధారణ రకాలు కాల్షియం ఆక్సలేట్ రాళ్లు. ఇవి ఎక్కువగా పాలకూర వల్లే ఏర్పడతాయని వైద్యులు అంటున్నారు.
100 గ్రాముల పాలకూరలో 970 మిల్లీగ్రాముల ఆక్సలేట్ ఉంటుంది. పాలకూరను ఉడకబెట్టడం వల్ల ఆక్సలేట్‌ని కొంతవరకు తగ్గించవచ్చు. క్యాల్షియం ఆధారిత ఆహార పదార్థాలైన పెరుగు, పనీర్‌ను పాలకూరతో కలిపి తినడం వల్ల రాళ్లు ఏర్పడకుండా తగ్గించుకోవచ్చు.
పాలకూరలో ప్యూరిన్ రసాయన సమ్మేళనాలు గౌట్‌కు దోహదం చేస్తాయని అనుకుంటారు.. అయితే ప్యూరిన్ అధికంగా ఉండే కూరగాయలను తీసుకోవడం వల్ల గౌట్ సంబంధిత సమస్యలు వస్తాయి. పాలకూరను ఎక్కువగా తీసుకోవడం వల్ల BP, రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇప్పటికే ఈ సమస్యలతో పోరాడుతున్న వారికి ఈ సమస్య రావచ్చు.
పాలకూరలో అధికంగా విటమిన్-కె ఉంటుంది, ఇది ఇతర మందులతో కలిపి ఔషధాల ప్రభావాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా స్ట్రోక్ రాకుండా నిరోధించడానికి బ్లడ్ థిన్నర్స్ ఇస్తారు. అందుకే సున్నిత మనస్కులు పాలకూర తీసుకోవడం తగ్గించాలి. ఒక కప్పు పచ్చి పాలకూరలో 145 mcg పోషకాలు ఉంటాయి. సాధారణంగా, పాలకూరను అప్పుడప్పుడు లేదా తక్కువ మొత్తంలో తినవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news