మరో రూ. 4,557 కోట్ల అప్పు చేసిన జగన్ సర్కార్ !

-

జగన్‌ సర్కార్‌ మరోసారి అప్పు చేసింది. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఆర్థిక సంవత్సరం చివరి తైమాసికంలో రూ. 4,557 కోట్ల రుణాలకు మాత్రమే కేంద్రం అనుమతి ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అనేక రకాలుగా ప్రయత్నించిన ఆశించిన మేర కొత్త రుణాలకు అనుమతి దక్కలేదు. జనవరి సహా ఈ మూడు నెలల్లో ఈ మొత్తం తోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో కలిపి మొత్తం మీద రూ.49,860 కోట్ల బహిరంగ మార్కెట్ రుణాలకు ఆంధ్రప్రదేశ్ కి అనుమతులు ఇచ్చినట్లు కేంద్రం వెల్లడించింది. ఇప్పటికే రాష్ట్రం రూ.4,5303 కోట్లు వినియోగించుకోవడంతో ఇక మిగిలిన రూ. 4,557 కోట్లకు తాజాగా అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రోజులకు ఈ అప్పుల అనుమతులు వర్తిస్తాయని కేంద్ర ఆర్థిక శాఖ తెలియజేసింది.

Read more RELATED
Recommended to you

Latest news