పబ్జీగేమ్‌కు బానిసైన విద్యార్థులు,యువకుల బలిదానాలు కొనసాగతూనే ఉన్నాయి.గేమ్‌పై బ్యాన్ విధించాలని సామాజిక కార్యకర్తలు, రాజకీయపార్టీలు అనేక విమర్శలు చేస్తున్నప్పటికి కేంద్ర ప్రభుత్వం చాలా లేటుగా నిర్ణయం తీసుకుంది..అప్పటికే గేమ్కు బానిసలైన విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు..తాజాగా మరో విద్యార్థి ప్రాణాలను పబ్జీగేమ్ బలిగొంది..తిరుపతిలో ఇంటర్ చదువుతున్న తేజోష్ అనే విద్యార్థి పబ్జీ గేమ్ కాటుకు బలయ్యాడు..పబ్జీ గేమ్‌లో గన్ కొనేందుకు తండ్రిని రూ 3 లక్షలు అడిగాడు తండ్రి డబ్బులో ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు..తన మృతికి ఎవరూ కారణం కాదంటూ లేఖ రాసి సూసైడ్ చేసుకున్నాడు.