ఆన్‌లైన్‌ గేమ్‌తో మరో యువకుడు బలి..!

-

నేటి సమాజంలో యువత ఆన్ లైన్ గేమ్స్ కి బానిసలైయ్యారు. ఆన్ లైన్ గేమ్స్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మొదట యువకులు ఆన్ లైన్ గేమ్స్ ని సరదాగా మొదలు పెట్టి.. ఆ తర్వాత ఆన్‌లైన్‌ గేమ్‌లకు బానిసలైపోతున్నారు. అంతటితో ఆగకుండా మరికొంత మంది యువకులు అప్పులు చేసి మరి గేమ్స్ ఆడుతున్నారు. అప్పుల్లో కూరుకుపోయి చివరకు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఆన్‌లైన్ గేమ్స్‌ కారణంగా ఇప్పటికే అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది ప్రమాదాల బారినపడ్డారు. ఆన్‌లైన్ గేమ్స్‌తో కొందరు తమ ఆస్తులను కూడా కోల్పోయిన ఘటనలు చూశాం. తాజాగా ఎల్బీనగర్‌ లో అలాంటి ఘటనే చోటు చేసుకుంది.

suicide
suicide

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎల్బీనగర్‌కు చెందిన జగదీష్ అనే యువకుడు ఆన్‌లైన్‌ గేమ్స్‌కు బానిసైపోయాడు. జగదీష్ ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. గతంలోనే ఆన్ ‌లైన్‌ గేమ్స్‌ ఆడి రూ.16 లక్షల వరకు పోగొట్టుకున్నాడు. అప్పులు ఎక్కువ కావడంతో.. కొడుకు బాధను చూడలేక.. జగదీష్‌ తండ్రి ఆ రూ.16 లక్షల అప్పులు తీర్చాడు. మరి పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలి అనుకున్నాడో ఏమో మరి.. కానీ, మళ్లీ ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడడం ప్రారంభించాడు జగదీష్‌. అప్పులను అధిగమించేందుకు మళ్ళీ ఆన్‌ లైన్‌ గేమ్స్‌ ఆడడం ప్రారంభించాడు.. కానీ, తిరిగి డబ్బులు రాకపోవడానికి తోడు.. మళ్లీ అదనంగా అప్పులు అవుతుండడంతో.. తీవ్ర మనస్తాపానికి గురైన జగదీష్‌.. సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మ హత్యకు పాల్పడ్డాడు.

Read more RELATED
Recommended to you

Latest news