మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్య కుట్ర కేసులో మరో ట్విస్ట్ ఎదురైంది. సైబరాబాద్ సీపీ, మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో సహా 18 మందికి మహబూబ్‌నగర్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 10వ తేదీన కోర్టుకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుట్ర కేసులో రాజు, పుష్పలత మహబూబ్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ మేరకు శ్రీనివాస్ గౌడ్‌పై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చారని ఆరోపించారు.
పిటిషన్‌లో రాజు సీసీ ఫుటేజీ, హార్డ్ డిస్క్ లను దొంగిలించారని పేర్కొన్నారు. అలాగే ప్రధాన విటెనెస్ విశ్వనాథ్‌ను కిడ్నాప్ చేశారని పుష్పలత ఫిర్యాదు చేశారు. కాగా, హత్య కుట్ర కేసులో గతంలో రాజు, విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్‌పై బయటకొచ్చిన రాజు మహబూబ్‌నగర్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.