హత్రాస్‌ యువతి హత్య కేసులో మరో ట్విస్ట్..సిట్ అధికారి భార్య ఆత్మహత్య.

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు గ్రామానికి చెందిన యువతి గ్యాంగ్ రేప్‌ హత్యకేసులో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తుంది..కేసును విచారిస్తున్న పోలీస్‌ అధికారి భార్య ఆత్మహత్య చేసుకుంది..హత్రాస్ హత్య-గ్యాంగ్‌రేప్ కేసు దర్యాప్తు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్‌లో సభ్యుడైన ఉత్తరప్రదేశ్ సీనియర్ పోలీసు అధికారి భార్య ఇంటి వద్ద ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు..

ఈ సిట్ సభ్యుల్లో ఒకరైన డీఐజీ చంద్ర ప్రకాశ్ భార్య పుష్ప ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది..ఈ ఉదయం లక్నోలోని వారి నివాసంలో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. ఈ ఘటనను గమనించిన కుటుంబసభ్యులు ఆమెను లోహియా ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టు మార్టం నిమిత్తం ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ ఆసపత్రికి తరలించారు. ఈ ఘటనపై లక్నో ఈస్ట్ జోన్ డీసీపీ చారు నిగమ్ మాట్లాడుతూ, ఘటనా స్థలిలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని చెప్పారు.