బ్రేకింగ్ : మెట్ పల్లిలో మైనర్ బాలికపై దారుణ గ్యాంగ్ రేప్

సభ్యత, సంస్కారాలకు పెట్టింది పేరయిన మన దేశంలో యువత పెడధోరణులు రోజురోజుకు హద్దులుదాటున్నాయి. ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా మహిళలకు సరైన రక్షణ కల్పించలేకపోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై అఘాయిత్యాలు జరగకుండా ఎన్ని చట్టాలు తెచ్చినా వారి మూర్ఖత్వం మాత్రం మార్చుకోవడం లేదు కొంతమంది మ్రుగాళ్ళు. తాజాగా జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో దారుణ సంఘటన జరిగింది.

14 ఏళ్ల మైనర్ బాలికపై ఐదుగురు యువకులు అత్యాచారం చేశారు. అత్యాచారం చేస్తుండగా వీడియో తీసిన సదరు నిందితులు దానిని వీడియో సోషల్ మీడియాలో పెట్టి వైరల్ చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. ఈ వీడియో చూసిన బాలిక బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఐదుగురు నిందితులు ఉన్నట్టు చెబుతున్నారు. నిందితులపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు వారిని రిమాండ్ కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు.