కొండపల్లి మున్సిపల్‌ ఫలితాల్లో మరో ట్విస్ట్‌..టీడీపీలో చేరిన ఇండిపెండెంట్ అభ్యర్థి

కృష్ణా జిల్లాలోని కొండపల్లి మున్సిపల్‌ పోరు ఫలితాల్లో క్షణ క్షణం ఉత్కంఠగా మారుతోంది. వైసీపీ పార్టీ, టీడీపీ పార్టీలు సమానంగా వార్డులు గెలవడంతో…. ఎప్పుడు ఏం జరుగుతుందోనని అందరూ ఆసక్తి గా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే… కొండపల్లి మున్సిపల్‌ పోరులో మరో ట్విస్ట్‌ నెలకొంది.

ycp-tdp
ycp-tdp

ఆజ్ఙాతం లోకి వెళ్లిన… ఇండిపెండెంట్‌ అభ్యర్థి శ్రీ లక్ష్మి… అందరికీ షాక్‌ ఇస్తూ… తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకుంది. దీంతో కొండపల్లి లో 15 కి టీడీపీ పార్టీ వార్డు సభ్యుల సంఖ్య చేరింది. అయితే.. కొండపల్లి చైర్మన్‌ ఎన్నికలో ఎక్స్‌ అఫీషియో ఓట్లు కీలకం కానున్నాయి. ఎలాగైనా… కొండపల్లి చైర్మన్‌ పీఠాన్ని దక్కించుకుంటామని తెలుగు దేశం పార్టీ చెబుతుంటే.. ఎంత ఖర్చు పెట్టి అయినా… ఆ పీఠాన్ని సొంతం చేసుకునేందుకు వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. మరి కొండపల్లి చైర్మన్‌ పీఠం ఎవరిని వరించునో చూడాలి.