95 శాతం పని చేస్తున్న మరో వ్యాక్సిన్

95% పైగా మా వ్యాక్సిన్ పని చేస్తుంది అని రష్యా వెల్లడించింది. స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ ఒక మోతాదు అంతర్జాతీయ మార్కెట్లలో పది డాలర్లు ఉంటుంది అని రష్యా వెల్లడించింది. ఒక్కొక్కరికి రెండు మోతాదులు అవసరం అని వైద్యులు పేర్కొన్నారు. ఒక్కొక్కరికి 20 డాలర్లు అంటే (రూ. 1480) కంటే తక్కువగా ఉంటుంది. స్పుత్నిక్ వీ ని జనవరి నుంచి డెలివరి చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.

భారత్ తో పాటుగా ఇతర దేశాల్లో ఈ వ్యాక్సిన్ తయారు చేస్తున్నామని రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (ఆర్డిఐఎఫ్) తెలిపింది. 2021 లో 500 మిలియన్లకు పైగా ప్రజలకు వ్యాక్సిన్ ఉత్పత్తి చేయడానికి అంతర్జాతీయ తయారీ భాగస్వాములతో ఆర్డీఎఫ్ ఇప్పటికే ఉన్న ఒప్పందాలను ఇంకా విస్తరిస్తోంది. రష్యన్ పౌరులకు టీకాలు ఉచితంగా ఇస్తామని చెప్పింది.