గ్రేటర్లో ఎన్నికల ప్రచారం పూర్తిగా స్థానిక సమస్యలకు దూరంగా నడుస్తుంది..గ్రేటర్ ఎన్నికలు ఓల్డ్ సిటీ చుట్టు తిరుగుతున్నాయి..లోకల్ ఎన్నికల్లో లోకల్ సమస్యలపై కాకుండా సరిహద్దు, పాక్,బంగ్లాదేశ్, రోహింగ్యాలు లక్ష్యంగా ప్రచారం జరుగుతుంది..మరి ముఖ్యంగా బీజేపీకి గ్రేటర్ ఎన్నికల్లో రోహింగ్యాలు ప్రచారాస్త్రంగా మారిపోయారు..హైదరాబాద్‌లో దాదాపు 40 వేల మంది రోహింగ్యాలు ఉన్నారని..వారందరికి పాతబస్తీ షెల్టర్ జోన్‌గా మారిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్..వారందరూ మజ్లిస్‌కు ఓటు వేస్తున్నారని..ఎంఐఎంకు మద్థతుగా ఉంటున్నారని ప్రచారం ర్యాలీలో వ్యాఖ్యానించారు..బల్డియా ఎన్నికల్లో మేయర్ పీఠం బీజేపీకి కట్టబెడితే..హైదరాబాద్‌లో రోహింగ్యాల ఏరివేస్తామన్నారు..పాతబస్తీపై సర్జికల్ స్ట్రయిక్ చేస్తామన్నారు బండి సంజయ్…బండి సంజయ్ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. సంజయ్ వ్యాఖ్యలపై అటు టీఆర్ఎస్, ఇటు ఎంఐఎం విరుచుకుపడ్డాయి.మరోవైపు బండి సంజయ్ సర్జికల్ స్ట్రైక్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ ఫైరయ్యారు. కొన్ని ఓట్లు, సీట్లకోసం సంజయ్ మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు.. సంజయ్ వ్యాఖ్యలను హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి సమర్ధిస్తారా? అని కేటీఆర్ ట్వీట్ చేశారు. పాతబస్తీలో 40వేల మంది రోహింగ్యాలున్నారని బీజేపీ అంటోందని..మరి హోంమంత్రి అమిత్ షా ఎందుకు ఏం చేయడం లేదని ప్రశ్నించారు..పాతబస్తీలో ఉన్న కనీసం వెయ్యిమంది రోహింగ్యాల కుటుంబాల వివరాలు చెప్పాలన్నారు.. హైదరాబాద్ ఎవరి చేతిలో ఉండాలో ప్రజలే డిసైడ్ చేయాలన్నారు మంత్రి కేటీఆర్..ఓట్లు..సీట్ల కోసమే బీజేపీ నేతలు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అన్నారు మంత్రి కేటీఆర్..
సర్జికల్ స్ట్రయిక్‌కు సంబంధించి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలేంటో తనకు తెలియదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దానికి కేటీఆర్ ఏం ట్వీట్ చేశారో కూడా తెలియదన్నారు..గ్రేటర్ ఎన్నికల్లో జనం బిజిపి వైపు ఉన్నారని ధీమా వ్యక్తంచేశారు..బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థుల కోసం ప్రచారంలో ఉన్నానని చెప్పారు. బిజెపి సమర్థవంతంగా దేశాన్ని పాలిస్తోందని అన్నారు. హైదరాబాద్‌ను కూడా సమర్ధవంతంగా పాలిస్తామని..అభివృద్ధి చేస్తామని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట్లో చర్చ జరుగుతుంది..కేంద్ర హోం సహయక మంత్రిగా ఉండి..అందులో గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ప్రచార బాధ్యతల్లో ఉండి..తమ పార్టీ అధ్యక్షుడు, సహచర ఎంపీ చేసిన వ్యాఖ్యల గురించి తెలియదనడం తెలివిగా తప్పించుకోవడే అంటున్నారు సిటిజన్స్..ఒక ఎంపీ చేసిన వ్యాఖ్యలపైనే సమాచారం లేదనడంతో దేశ భద్రత,పాలనపై తనకు ఎంత శిత్త శుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చుంటున్నారు..బండి సంజయ్ వ్యాఖ్యల వివాదంపై మంత్రి కిషన్ రెడ్డి స్పందించకపోవడం అంటే పరోక్షంగా సమర్థించినట్లే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఇంకోవైపు బండి సంజయ్ వ్యాఖ్యలపై ఇప్పుడు దేశ రాజకీయంలో చర్చ జరుగుతుంది..సర్జికల్ స్ట్రైక్ అనేది పాక్‌పై మోడీ ప్రభుత్వం చేసిన దాడి తర్వాత ఎక్కువ ప్రాచుర్యంలోకి వచ్చింది..హైదరాబాద్ పాతబస్తీలో ఏలాంటి సర్జికల్ స్ట్రైక్ చేస్తారో బీజేపీ చెప్పకపోవడంతో రాజకీయ వర్గాల్లో ఆందోళన మొదలైంది..ఒక మున్సిపలిటీ మేయర్ రాష్ట్రంలో ఉన్నఅక్రమ చోరబాట్లను నియంత్రణ చేస్తారా?..దేశంలో ఉన్న అంతర్గత సమస్యలపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామడం అంటే స్థానిక ప్రజలపై దాడి చేయటమే అంటున్నారు నిపుణులు..పాతబస్తీలో రోహింగ్యాలు,అక్రమ చోరబాటు దారులను నియంత్రించవల్సిన బాధ్యత ఎవరిపై ఉంటుందని ప్రశ్నిస్తున్నారు.. ఒక వేళ సర్జికల్ స్ట్రైక్ చేయాల్సి వస్తే అంతర్జాతీయ సమాజం ముందు భారత్ దోషిగా నిలబడవల్సి వస్తుందంటున్నారు..అంతర్గత సమస్యలు పరిష్కరించ కుండా భారత్ వంటి దేశాలు సర్జికల్ స్ట్రైక్ చేస్తున్నారు..సమస్యల పరిష్కరించుకోవడానికి ఇండియాకు ఒక విజన్ లేదనే అపవాదు అంతర్జాతీయ సమాజం నుంచి ఎదుర్కోవల్సి వస్తుందంటున్నారు..