Ante Sundaraniki : “అంటే సుందరానికి” టీజర్‌ కు ముహుర్తం ఫిక్స్‌

-

టాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేస్తూ.. దూసుకుపోతున్నాడు న్యాచురల్‌ స్టార్‌ నాని. గత ఏడాది డిసెంబర్‌ 24 వ తేదీన విడుదల అయిన… శ్యామ్‌ సింగరాయ్‌ కు కూడా భారీ విజయాన్ని అందుకోవడంతో.. నాని క్రేజ్‌ మరింత పెరిగింది. ఇది ఇలా ఉండగా.. ప్రస్తుతం నాని చేస్తున్న మరో సినిమా “అంటే సుందరానికి”.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో… అంటే సుందరానికి సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కోలీవుడ్‌ నటి నజ్రియా నజీమ్‌ హీరోయిన్‌ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్‌ బ్యానర్‌ లో వస్తుంది. అయితే.. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చింది.

ఈ సినిమా నుంచి టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం. ఈ టీజర్ ను ఏప్రిల్‌ 20 వ తేదీన అంటే ఎల్లుండి… ఉదయం 11.07 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. కాగా… “అంటే సుందరానికి” మూవీ జూన్ 10 వ తేదీన థియేటర్ల లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news